in

Radhika Apte reveals about her strong warning to telugu hero!

2018లో ఒక తెలుగు చిత్రం షూటింగ్ తొలి రోజే ఓ టాప్ హీరో నుంచి ఘోరమైన అనుభవం ఎదురైందని రాధికా ఇటీవల బయటపెట్టింది. ‘‘అది తెలుగు సినిమాలో నా మొదటి రోజు. అందులో నా ఆరోగ్యం బాగా ఉండకపోవడంతో నేను పడుకునే సీన్ ఒకటి ఉంటుంది. నా చుట్టూ చాలామంది ఉన్నారు. అంతా సెట్ అయిపోయి ఉంది. అప్పుడే ఆ సీనియర్ హీరో లోపలికి వచ్చారు. మేము రీహార్సెల్స్ చేస్తున్నాం. నాకు అప్పటికీ ఆయన ఎవరో తెలియదు. అయినా ఆయన నా కాలికి కితకితలు పెట్టడం మొదలుపెట్టారు. ఆయన చాలా పెద్ద యాక్టర్. అంతే కాకుండా చాలా పవర్‌ఫుల్ అని కూడా నాతో చాలామంది చెప్పారు’’ అని రాధికా బయటపెట్టింది.

సీనియర్ హీరో అయినా కూడా తనకు కోపం వచ్చినప్పుడు, వారు చేసేది ఏదైనా తనకు నచ్చనప్పుడు మొహం మీదే చెప్పేస్తానని, అందుకే ఆ సమయంలో అలా మళ్లీ ఎప్పటికీ, ఎప్పటికీ చేయవద్దని ఆ సీనియర్ హీరోకు వార్నింగ్ ఇచ్చానని రాధికా బయటపెట్టింది. అక్కడ మొత్తం క్రూ, జూనియర్ ఆర్టిస్టులు, అందరూ ఉన్నారు. అందరి ముందే అలా గట్టిగా చెప్పానని తెలిపింది. తాను అలా చెప్తానని ఊహించని ఆ హీరో కాస్త షాక్ అయ్యారని గుర్తుచేసుకుంది. ఏది ఏమైనా ఆ హీరోతో మళ్లీ తనను టచ్ చేయలేదని చెప్పింది..!!

can sukumar give much needed hit for rashmika!

malayali beauty Reba Monica John missed 2 golden chances!