in

can sukumar give much needed hit for rashmika!

సీతారామం హిట్ అయినా అందులో క్రెడిట్ మొత్తం మృణాల్ ఠాకూర్ కే వెళ్ళిపోతుంది. ఇక వారిసు సినిమాలో అయితే కేవలం పాటలకే పరిమితమయ్యింది. దాంతో ఈ నేషనల్ క్రష్ ఫాలోయింగ్ ఏమైనా తగ్గిందా అన్న అనుమానం వచ్చే పరిస్థితి నెలకొని ఉంది. దానికి తోడు ఇప్పుడు రష్మిక చేస్తున్న సినిమాలు కూడా తక్కువే. ఈ బ్యూటీ చేతిలో మూడు సినిమాలే ఉండగా , అందులో తెలుగు సినిమా ఒక్కటే ఉంది. అదే “పుష్ప ది రూల్”. నితిన్ సినిమాలో చేస్తున్నప్పటికీ ఈ సినిమా నుండి రష్మిక ని తప్పించి ఆ స్థానంలో శ్రీ లీల ని తీసుకున్నారని వార్తలొస్తున్నాయి.

కాబట్టి ప్రస్తుతానికి పుష్ప2 ఒక్కటే తన చేతిలో ఉందన్నమాట. అయితే ఈ సినిమాలో రష్మిక చనిపోతుందంటూ ఎప్పట్నుంచో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అది ఎంత వరకు నిజమో తెలియదు కానీ, ఈ సినిమా విజయం పైనే రష్మిక తెలుగు కెరీర్ ఆధారపడి ఉందని తెలుస్తుంది. అదీ గాక ఆ సినిమాలో రష్మిక కి సుకుమార్ మంచి ఇంపార్టెన్స్ ఇవ్వగలిగితే దానిద్వారా ఈ భామకి నటనకు ప్రాధాన్యం ఉన్న రోల్స్ కూడా దొరకవచ్చు. ఇక ప్రస్తుతం అనిమల్ చిత్ర షూటింగ్ లో బిజీ గా ఉన్న రష్మిక అది పూర్తవగానే పుష్ప2 సెట్స్ లో అడుగుపెడుతుంది..!!

Samantha Took 25 Crores From Top Telugu Hero for treatment?

9 years for geethanjali!