in

Raashi Khanna turns TV serial actor for ‘Pakka Commercial’!

టాలీవుడ్ డైరెక్ట‌ర్ మారుతి, యంగ్ హీరో గోపీచంద్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న చిత్రం ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌’. గీతాఆర్ట్స్-2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రాశీఖ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది. ‘ప్ర‌తీ రోజూ పండ‌గే’ చిత్రం త‌ర్వాత‌ రాశీఖ‌న్నా కోసం క్రేజీ రోల్ ఒక‌టి మారుతి డిజైన్ చేశాడ‌ట‌. ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌’ మూవీలో టీవీ సీరియ‌ల్ న‌టిగా క‌నిపించ‌నుంద‌ని టాక్ వినిపిస్తోంది. ఫ‌న్నీ క్యారెక్ట‌రైజేష‌న్ తో రాశీఖ‌న్నా రోల్ సాగుతుంద‌ట‌. కాగా గోపీచంద్ ఎటువంటి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌నేది మాత్రం ప్రస్తుతానికి స‌స్పెన్స్ గా ఉంది.  గోపీచంద్ ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌’ టైటిల్ రోల్ లో పాత్ర చేసే అవకాశం ఉంది.  మ‌రోవైపు గోపీచంద్, సంప‌త్ నంది డైరెక్ష‌న్ లో తెరకెక్కిన ‘సీటీమార్’ సినిమా ఏప్రిల్ 2న విడుద‌ల కానుంది. క‌బ‌డ్డీ క్రీడ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది..

Prabhas welcomes Kriti Sanon as Sita, Sunny Singh as Lakshman!

majili girl divyansha kaushik signs her next in tollywood!