in

Prabhas welcomes Kriti Sanon as Sita, Sunny Singh as Lakshman!

యంగ్ రెబల్ స్టార్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా  ‘ఆదిపురుష్’. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా కనిపించనుండగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావసణుడిగా నటిస్తున్నారు. అయితే ప్రభాస్‌కు జోడీగా సీత పాత్రలో ఎవరు నటించనున్నారు అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

సీత పాత్రలో అనుష్క శర్మ, కీర్తి సురేష్‌ సహా పలువురి పేర్లు వినిపించినా..చివరికి  కృతి సనన్‌ను ఫైనలైజ్‌ చేశారు. ఈ విషయాన్నిస్వయంగా హీరో ప్రభాస్‌ వెల్లడించాడు. అంతేకాకుండా లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్‌ యంగ్‌ హీరో సన్నీ సింగ్‌ నటించనున్నారు.  ఈ ఇద్దరిని ఆదిపురుష్‌ టీంలోకి స్వాగతిస్తూ ప్రభాస్‌ ఫోటోలను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి..

director shankar feels kiara is the perfect choice for charan!

Raashi Khanna turns TV serial actor for ‘Pakka Commercial’!