in

‘Pushpa’ actor Jagdish arrested in junior artist’s suicide case!

ల్లు అర్జున్ పుష్ప..ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక ఇందులో అల్లు అర్జున్ కుడి భుజంగా ఆయనకు స్నేహితుడు పాత్రలో నటించిన కేశవ అలియాస్ జగదీష్ ప్రతాప్ భండారి తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. ఇక ఈ నటుడు వేధింపులతో పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న జూనియర్ ఆర్టిస్ట్ అయిన ఒక మహిళ గత నెల 29వ తేదీన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా.. మహిళ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు.

ఇక అందులో భాగంగానే ఇప్పుడు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇకపోతే ఆత్మహత్య చేసుకున్న ఆ మహిళ గత నెల 27వ తేదీన ఒక వ్యక్తితో ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండానే జగదీష్ ఫోటోలు తీసి ఆ తర్వాత వాటిని చూపించి ఆమెను బెదిరించాడట. దీంతో మనస్థాపానికి గురైన జూనియర్ ఆర్టిస్టు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిందని పంజాగుట్ట పోలీసులు వెల్లడించారు..!!

Animal beauty Tripti Dimri in Ravi Teja’s next?

Prashanth Neel gives crazy updates on KGF 3 and NTR Film!