in

Animal beauty Tripti Dimri in Ravi Teja’s next?

యానిమల్ సినిమాను చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులంతా త్రిప్తిని మరిచిపోలేకపోతున్నారు. అసలు జోయా పాత్రలో నటించిన ఆ బ్యూటీ ఎవరు? అంటూ ఆరాలు తీయడంతో సోషల్ మీడియా షేక్ అయిపోయింది. త్రిప్తి బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవడానికి అందరూ బాగా ఆసక్తిని కనపరిచారు. ఇక సినిమాలో ఏకంగా నగ్నంగా కనిపించడానికి సాహసం చేసిన ఈ బ్యూటీపై విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపించారు.

మూవీలో రణబీర్ కపూర్, త్రిప్తి మధ్య వచ్చే సన్నివేశాలు కుర్రాళ్లను హీటెక్కించాయి. మైండ్ బ్లాక్ చేసే అలాంటి బోల్డ్ సన్నివేశాల్లో నటించిన త్రిప్తి ఒక్కసారిగా సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. అంతేకాకుండా టాలీవుడ్ లో ఈ బ్యూటీ కి ఆఫర్ల వెలువ రావడం ఖాయం అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేశారు. త్రిప్తి ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి మాస్ మహారాజా రవితేజ టెంప్ట్ అయినట్టు తెలుస్తోంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ నెక్స్ట్ మూవీ చేయబోతున్నట్టు సమాచారం..!!

sai pallavi to star in 2 pan indian movies?

‘Pushpa’ actor Jagdish arrested in junior artist’s suicide case!