in

Prashanth Neel gives crazy updates on KGF 3 and NTR Film!

ప్రశాంత్ నీల్ తాజాగా చేసిన అప్‌డేట్ అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెంచేసింది. సినిమా కథకు నేపథ్యం ఏంటనే విషయంలో ఆయన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ తాను తీసిన చిత్రాలన్నిటికీ ఎన్టీఆర్ 31 విభిన్నంగా ఉంటుందన్నారు. అయితే, కథ నేపథ్యం ఏమిటో పూర్తిగా వెల్లడించలేదు. ఇది యాక్షన్ చిత్రమన్న భావన ప్రజల్లో ఉందని, జానర్ ఏదైనా అది వారికి బాగా కనెక్ట్ అవుతుందని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. కేజీఎఫ్-3 గురించి కూడా ప్రశాంత్ నీల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధమైందని వెల్లడించారు. కేజీఎఫ్-2కు సీక్వెల్ ఉంటుందనే ఉద్దేశంతోనే ఆ సినిమా చివర్లో హింట్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన సలార్ పార్ట్-1- సీజ్ ఫైర్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు..!!

‘Pushpa’ actor Jagdish arrested in junior artist’s suicide case!

Meenakshii Chaudhary and Urvashi Rautela in NBK109?