గత కొన్ని రోజుల కితం టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నామని పలువురు హీరోయిన్లను అప్రోచ్ అయి వేధించిన సంగతి తెలిసిందే. అది ఎంత పెద్ద దుమారాన్ని లేపిందో కూడా అందరికీ తెలుసు. అయితే ఆ తమిళ నిర్మాణ సంస్థ డస్కీ ఎంటర్ టైన్మెంట్స్ తన తప్పును తెలుసుకుంది.హీరో విజయ్ దేవరకొండ కు క్షమాపణలు చెబుతూ ప్రకటన విడుదల చేసింది.తమ ప్రమేయం లేకుండా ఓ ఏజెన్సీ ఇలా చేసిందనీ,వాళ్లమీద వెంటనే చర్యలు తీసుకుంటామనీ,భవిష్యత్ లో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది.
విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నామని పలువురు హీరోయిన్లను అప్రోచ్ అయింది డస్కీ ఎంటర్ టైన్మెంట్స్.విజయ్ కు మాకు సైన్ చేశాడనీ,మీరు కూడా ఒప్పుకోవాలని కాల్స్ చేసి వేధించారు.కొందరు హీరోయిన్లు నిజమా కాదా అని చెక్ చేసుకునేందుకు విజయ్ టీమ్ ను అప్రోచ్ అయ్యారు.ఇంతకుముందు కూడా కొందరు విజయ్ పేరు చెప్పి ఆడిషన్స్ నిర్వహించడం వల్ల టీమ్ విజయ్ దేవరకొండ హెడ్ అనురాగ్ పర్వతనేని వెంటనే అలెర్ట్ అయ్యారు.