in

PRODUCER IS THE BOSS ANI PROVE CHESINA MURARI!

డైరెక్టర్ ని కాదని తాను చెప్పిన క్లైమాక్ తో సినిమా విడుదల చేసిన నిర్మాత కాట్రగడ్డ మురారి గారు. సినీ నిర్మాతకు నిలువెత్తు నిదర్శనం కాట్రగడ్డ మురారి గారు. నిర్మాత అంటే కేవలం ఏ.టి.ఏం. మిషన్ గ మారిపోయిన, మారిన కాలం లో సినిమాలు చేయక పోయిన తాను సినిమాలు నిర్మించినంత కాలం ” ప్రొడ్యూసర్ ఇస్ ది బాస్” అని నిరూపించారు. యువచిత్ర బ్యానర్ మీద ” సీత మాలక్ష్మి” అనే సినిమా నిర్మాణ సందర్భం లో, డైరెక్టర్ విశ్వనాధ్ గారు ఆ చిత్రానికి ట్రాజిక్ ఎండ్ అనుకున్నారు, కానీ కధనం మొత్తం సరదాగా, కామెడీ టచ్ తో సాగిన సినిమా కాబట్టి హ్యాపీ ఎండింగ్ ఉండాలి అని మురారి గారు పట్టు పట్టారు.

విశ్వనాథ్ గారు ఎంత చెప్పిన మురారి గారు వినకపోవడం తో, విశ్వనాధ్ గారు ట్రాజెడీ, మరియు హ్యాపీ ఎండింగ్ రెండు క్లైమాక్స్ లు చిత్రీకరించి . ఏ క్లైమాక్ తో సినిమా రిలీజ్ చేస్తారో మీ ఇష్టం అంటూ నిర్మాత నిర్ణయానికి వదిలేసారు, పట్టువదలని మురారి గారు తాను అనుకున్నట్లుగానే హ్యాపీ ఎండింగ్ తోనే సినిమా రిలీజ్ చేసారు. సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. సినీ నిర్మాతగా మారక ముందు మురారి గారు వి.మహాదుసూధన రావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గ , జెమినీ వాసన్, నాగిరెడ్డి, చక్రపాణి వంటి నిర్మాతల తో కలిసి పని చేయటం వలన సినిమా నిర్మాణ పట్ల పూర్తి అవగాహన తోపాటు వారి అలవాట్లను కూడా పుణికి పుచ్చుకున్నారు.

bangarraju!

F3 director anil ravipudi’s cameo in ‘Hero’ movie!