in

Priyanka Mohan gets super busy with telugu projects!

ప్రియాంక అరుళ్ మోహన్…ఫస్ట్ సినిమా గ్యాంగ్ లీడర్ తోనే తెలుగు ఆడియన్స్ మనసు గెలుచుకున్న ఈ చిన్నది ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీ అయిపోయింది. అయితే గ్యాంగ్ లీడర్ లో ప్రియాంక మోహన్ కి అందం, నటనకు మంచి మార్కులు పడ్డాయి. అలాగే సినిమా ఛాన్స్ లు కూడా వచ్చాయి. కానీ ఏవీ కూడా కెరీర్ కు యూజ్ కాలేదు. దీంతో కోలీవుడ్ గడప తొక్కిన ప్రియాంక మోహన్ కి అక్కడ సక్సెస్ దొరికింది. మళ్లీ తెలుగు ఇండస్ట్రీ వైపు చూసింది వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG సినిమాలో బంపర్ ఆఫర్ వచ్చింది.

పవన్ కళ్యాణ్ సినిమా అంటే కెరీర్ సెట్ అయినట్టే. అవకాశాలు అవ్వే వస్తాయని అందరూ అనుకున్నారు. అనుకున్నట్టే..నాని నటిస్తున్న సరిపోదా శనివారం సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయింది. అంటే తెలుగులోకి వచ్చిన వెంటనే చేతిలోకి రెండు సినిమాలు వచ్చి పడ్డాయి. తాజాగా మరో సినిమాకు కూడా ప్రియాంక అరుళ్ మోహన్ ను ఎంపిక చేసినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. రవితేజ, గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న మూవీలో హీరోయిన్ గా ఎంపిక చేయడానికి ప్రియాంక మోహన్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది..!!

happy birthday naga babu!

telugu Actress pragathi second marriage with a Producer?