టాలీవుడ్ లో ఒకప్పుడు తన అందాల ఆరబోతతో కుర్ర కారుల మనసులని దోచేసిన హీరోయిన్ ప్రియమణి. సమయం గడిచే కొద్ది కొత్త హీరోయిన్స్ రావడంతో టాలీవుడ్ లో ఈ భామకు పూర్తిగా అవకాశాలు లేకుండా పోయాయి. అయితే సినిమా అవకాశాలు లేకున్నా ఈమధ్య తరుచు వార్తల్లో ఉంటుంది ప్రియమణి. తాజాగా తను సౌత్ ఇండియన్ హీరోయిన్స్ మీద చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. సౌత్ లో ఎంతో మంది టాలెంటెడ్ హీరోయిన్స్ ఉన్న కూడా నయనతార, అనుష్క, ఈ హీరోయిన్స్ కు మాత్రమే భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నారంటూ ప్రియమణి చెబుతోంది.
కేవలం కొందరికి మాత్రమే సినిమాల్లో మంచి రోల్స్ ఇస్తూ దానికి తగినట్టుగా వారు అడగకముందే రెమ్యూనరేషన్ ఇస్తున్నారు, కానీ మాలాంటి మిడిల్ క్లాస్ హీరోయిన్స్ కు అసలు అవకాశాలే ఇవ్వట్లేదు, ఒకవేళ సినిమా వచ్చిన అది పూర్తయిన తరువాత ముందుగా అనుకున్న రెమ్యూనరేషన్ కంటే తక్కువ ఇస్తున్నారంటూ తన మనసులో ఉన్న బాధంతా బైట పెట్టింది ప్రియమణి.. సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఇంకా టాప్ హీరోయిన్స్ కు ఉన్న స్వేచ్ఛ, డిమాండ్ మాలాంటి మిడిల్ క్లాస్ హీరోయిన్స్ లేక ఇండస్ట్రీలో మా పరిస్థితి చాల దారుణంగా మారిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ అమ్మడు. ఇదంతా పక్కన పెడితే, సౌత్ లో ఎంతో మంది హీరోయిన్స్ ఉన్న ప్రియమణి కేవలం నయనతార, అనుష్క ల పేర్లు చెప్పడం ఇప్పుడు ఇంకో చర్చకు దారి తీస్తోంది.