in

Prithviraj As Villain In Mahesh Babu – Rajamouli SSMB29?

ద‌ర్శ‌కధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి చేస్తున్న తరువాతి సినిమాపై పాన్‌ఇండియానే కాదు, ప్రపంచ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఆయన తెరకెక్కించిన బాహుబ‌లి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అందరమూ చూశాము. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ వచ్చిన సమయంలో హాలీవుడ్ దర్శకులు సైతం ఆ చిత్రాన్ని, డైరెక్టర్ క్రియేటివిటీని కొనియాడారు. ఆ తరువాత ఆయన తన తరువాతి సినిమాను మహేష్ బాబుతో ఉంటుందని ప్రకటించారు. మహేష్ బాబుకు విలన్‌గా మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్ న‌టించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈమద్యే ‘సలార్’ సినిమాలో ప్రబస్ తో నటించిన ప్రిథ్వీరాజ్ తెలుగు వారికీ పరిచయం అయ్యారు..ప్రభాస్ పక్కన పర్ఫెక్ట్ కటౌట్ అంటూ అందరు మెచ్చుకునేలా నటించాడు..ఇక ఇప్పుడు మహేష్ పక్కన అది కూడా రాజమౌళి డైరెక్షన్ లో అంటే స్క్రీన్ మీద రచ్చ ఎలా ఉంటుందో ఊహించుకోండి. రాజమౌళి రైటింగ్ పార్ట్ పూర్తి చేయడానికి దగ్గరగా ఉన్నాడు మరియు ఇప్పుడు ప్రీ-ప్రొడక్షన్ మరియు కాస్టింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ ఆఫ్రికన్ జంగిల్ అడ్వెంచర్‌ను సోనీ పిక్చర్స్ లేదా డిస్నీ వంటి అంతర్జాతీయ స్టూడియో నిర్మించనున్నట్లు సమాచారం..!!

nayanthara breaking the rules for movie promotions!

yash to play Lord Hanuman in Prasanth Varma’s Jai Hanuman?