in

‘prem nagar’ cinema thera venuka jarigina katha!

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానేర్ లో నిర్మితమయిన ” ప్రేమ్ నగర్” చిత్రం ఎంత గొప్ప విజయం సాధించిన చిత్రమో అందరికి తెలుసు. కానీ మొదట ఆ చిత్రం నిర్మించాలనుకొని హక్కులు కొన్న నిర్మాత వేరే ఉన్నారు, కొన్ని కారణాల వలన అయన ఆ చిత్ర నిర్మాణం నిలిపివేయసారు, అక్కినేని గారి చొరవతో ఆ చిత్రాన్ని రామ నాయుడు నిర్మించటం జరిగింది. ఆ తెర వెనుక కథ తెలుసుకోవాలని ఉందా ? కోడూరి కౌసల్య దేవి నవల ప్రేమ నగర్ హక్కులు 60 000 రూపాయలకు శ్రీధర్ రెడ్డి అనే నిర్మాత కొనటం జరిగింది, ఆ నవలను నాగేశ్వర్ రావు గారికి ఇచ్చి చదివి అభిప్రాయం చెప్పామన్నారు. నవలలు చదివే అలవాటు లేని అక్కినేని, అన్నపూర్ణమ్మ గారికి ఇచ్చి చదవమన్నారట. ఆ నవల చదివిన ఆవిడ చాల బాగుంది, మీ దేవదాసు చిత్రం లో లేని అంశాలు చాల ఉన్నాయి చాల పెద్ద హిట్ అవుతుంది అని చెప్పారట. అక్కినేని గారు ఒకే చెప్పేసారు, హీరోయిన్ గ కె.ఆర్. విజయ గారిని అనుకున్నారు.

సినిమా కు అవసరం అయిన దుస్తులు కొనటానికి బయలుదేరిన శ్రీధర్ రెడ్డి గారి కారుకు ప్రమాదం జరిగింది, అది చూసిన వాళ్ళ ఆవిడ వద్దండి మనకు ఈ సినిమా వద్దు అని ఏదో అపశకునం లాగా ఫీల్ అయ్యారట, దానితో ఆ సినిమా అటక ఎక్కింది. అక్కినేని గారు రామ నాయుడు గారితో చెప్పారట స్టోరీ చాల బాగుంది మీరు ఆ హక్కులు తీసుకోండి మనం ఆ సినిమా చేద్దాం అన్నారట, అక్కినేని గారి మాట మీద నమ్మకం తో హక్కులు తీసుకొని ప్రేమ్ నగర్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకం గ నిర్మించారు, కె.ఆర్. విజయ స్థానం లో వాణిశ్రీ గారిని హీరోయిన్ గ తీసుకొన్నారు. ప్రేమ నగర్ చిత్రం అక్కినేని గారి కెరీర్ లోనే పెద్ద హిట్ గ నిలిచింది, సురేష్ ప్రొడక్షన్స్ ని అగ్ర నిర్మాణ సంస్థగా నిలిపింది, కాసుల వర్షం కురిపించింది. అందుకే అంటారు ఎవరికీ ఏది ప్రాప్తమో అది వారికే దక్కుతుంది అని.

uppena beauty in nani’s next!

double dhamaka for prabhas fans!