in

Meenakshii Chaudhary and Urvashi Rautela in NBK109?

బాలకృష్ణ సరసన మీనాక్షీ చౌదరి కథానాయికగా నటించే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల ఖబర్. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మాతృ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రస్తుతం ‘గుంటూరు కారం’ నిర్మిస్తోంది. ఆ సినిమాలో మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు.

ఆమెకు నిర్మాతలు మరో అవకాశం ఇస్తున్నట్లు సమాచారం..అదీ సంగతి..బాబీ దర్శకత్వం వహించిన లాస్ట్ సినిమా ‘వాల్తేరు వీరయ్య’. అందులో బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా ప్రత్యేక గీతం చేశారు. ఇప్పుడీ బాలకృష్ణ సినిమాలో కూడా ఆమె ఉంటున్నారని తెలిసింది. ప్రస్తుతం బాలకృష్ణ, ఊర్వశి రౌటేలాపై బాబీ కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. సీన్లతో పాటు సాంగ్ కూడా ఉంటుందని టాక్..!!

Prashanth Neel gives crazy updates on KGF 3 and NTR Film!

hi nanna!