in

Pragya promotes Whisky, Netizens call her drinker!

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రగ్యా జైస్వాల్.. ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్‌లకు సంబందించిన పిక్స్ షేర్ చేసుకుంటూ అభిమానులను అలరిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ప్రగ్యా పెట్టిన ఓ ఇన్‌స్టా పోస్ట్ ఆమెను ట్రోలింగ్‌కు గురిచేసింది. ఇంతకీ విషయం ఏంటంటే.. బ్లాక్ మినీలో క్లీవేజ్ డ్రస్ వేసుకున్న ప్రగ్యా ఓ ఫారిన్ బ్రాండ్ విస్కీని ప్రమోట్ చేశారు. ‘ప్రపంచ నంబర్ 1 అయిన బోర్బన్‌కు యాడ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. బాధ్యతాయుతంగా త్రాగండి.

25 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు వారు మాత్రమే’ అని ప్రగ్యా ట్వీట్ చేశారు…ఈ ట్వీట్ చుసిన నెటిజన్లు ప్రగ్యా జైస్వాల్‌పై మండిపడుతున్నారు. కామెంట్ల రూపంలో ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘ఈ సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టో’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ఇలాంటి యాడ్ చేస్తావా?’ అని ఇంకొకరు ట్వీట్ చేశారు.  డబ్బులు ఇస్తే.. ఏ యాడ్ అయినా చేస్తావా?, ప్రగ్యా ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? అంటూ బాలయ్యబాబు హీరోయిన్‌పై ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రగ్యా ఎఫ్ 2 సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు.

DIL RAJU REPLACED RAKUL WITH KAJAL AGARWAL!

Balakrishna and Ravi Teja multi-starrer on Cards!