in

prabhas Kalki 2898 AD to release in 22 languages?

ఏడాది సంక్రాంతికే అనుకున్న ఈ చిత్రాన్ని మే 9కి వాయిదా వేసిన సంగ‌తీ తెలిసిందే. ఐతే ఈ సినిమా ఆ టైంకి రెడీ అవుతుందా అనే విష‌యంలో సందేహాలు ముసురుకున్నాయి..ఇంకా ఈ మూవీ షూట్ పూర్త‌యిన‌ట్లు కూడా అప్‌డేట్ బ‌య‌టికి రాలేదు. మ‌రి భారీగా విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో ముడిప‌డ్డ సినిమాను ఇంకో 70 రోజుల్లో రిలీజ్ చేయ‌గ‌ల‌రా అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగానే ఉంది.

దీనికి తోడు క‌ల్కికి సంబంధించి వ‌స్తున్న తాజా స‌మాచారం ఏంటంటే..ఈ చిత్రాన్ని ఏకంగా 22 భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నార‌ట‌. అన్ని భార‌తీయ ప్ర‌ధాన భాషల‌తో పాటు అంత‌ర్జాతీయంగా అనేక లాంగ్వేజెస్‌లో క‌ల్కిని డ‌బ్ చేసి రిలీజ్ చేయ‌నున్నార‌ట‌. మ‌రి అన్ని భాష‌ల్లో రిలీజ్ అంటే డ‌బ్బింగ్ అదీ చేయ‌డానికే చాలా టైం ప‌డుతుంది. ఈ సినిమా రేంజ్ దృష్ట్యా డ‌బ్బింగ్ ఆషామాషీగా చేసినా క‌ష్ట‌మే..!!

Janhvi Kapoor approached for a special song in pushpa 2?

Pragya Jaiswal to be back in ‘second home’!