in

rakul preet singh calls vaishav tej a ‘different star’!

స్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా గ్రామీణ నేపథ్యం లో సన్నపు రెడ్డి వెంకట రామి రెడ్డి నవల “కొండపొలం” ఆధారంగా రూపొందిన ”కొండపొలం ” మూవీ అక్టోబర్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సాయి చంద్ , కోట , నాజర్ , అన్నపూర్ణ , హేమ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా రూపొందిన ఈ మూవీ లో వైష్ణ‌వ్ తేజ్ కటారు రవీంద్ర యాదవ్‌,

ర‌కుల్ ప్రీత్ సింగ్ ఓబులమ్మ అనే గ్రామీణ యువతిగా నటించారు. ”కొండపొలం ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఆ ఈవెంట్ లో తన కో- యాక్టర్ హీరో వైష్ణవ్ తేజ్ గురించి మాట్లాడుతూ రకుల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.వైష్ణవ్ బిగ్ స్టార్ అవుతాడని అందరూ అంటున్నారు కానీ ఆయన ఇప్పటికే గొప్ప స్టార్ అయ్యారనీ , తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారనీ , ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలని భావించే హీరోల్లో వైష్ణవ్ ఒకరనీ , అందరు హీరోల్లో ఆయన చాలా డిఫరెంట్ అనీ , వైష్ణవ్ కళ్ళు చాలా పవర్‌ఫుల్ అనీ చెప్పారు.

republic director Deva Katta is busy penning a script for Pk!

varshini at exquisite diva galleria jewellery showcase!