in

pooja hegde’s special song in ntr devara?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర మూవీలో ఒక  ఐటమ్ సాంగ్ ఉందని , దానికోసం పూజ హెగ్డే ని సంప్రదించగా ఓకే చెప్పిందని టాక్. పానిండియా సినిమాగా తెరకెక్కుతున్న దేవర లో పూజ ప్రత్యేక గీతంలో నటిస్తే ఎంతోకొంత గుర్తింపు లభిస్తుంది. పూజా కి ఇదేం కొత్త కాదు. ఇది వరకే  రామ్ చరణ్ తో కలిసి రంగస్థలం మూవీలో ఒక ఐటమ్ సాంగ్ లో నర్తించింది.

ఇప్పుడు ఈ స్పెషల్ సాంగ్ తో టాలీవుడ్ ని ఆకట్టుకునే పనిలో ఉందట పూజా.  అల వైకుంఠ పురం, అరవింద సమేత లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన పూజా ఇలా స్పెషల్ సాంగ్స్ కే పరిమితం అవటం ఆమె స్వయం కృతమే అంటున్నారు సినీక్రిటిక్స్. దేవర సినిమాకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు..!!

Raining Offers For Meenakshi chowdhary In Tollywood!

Raashii Khanna Enters nithin’s Robinhood?