in

pooja hegde to reunite with allu arjun and trivikram?

పూజ హెగ్డేకి కొంతకాలంగా బ్యాడ్ టైమ్ నడుస్తుందనే చెప్పాలి. పాన్ ఇండియా సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చినప్పుడు అదృష్టమంటే ఆమెదేనని అంతా అనుకున్నారు. కానీ ఆ సినిమాలు వరుసగా పరాజయంపాలవుతూ రావడం ఆమె అభిమానులను చాలా నిరాశ పరిచింది. అయితే పూజ హెగ్డే మాత్రం ఆత్మవిశ్వాసంతోనే కొత్త ప్రాజెక్టులను సెట్ చేసుకుంటూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే మహేశ్ త్రివిక్రమ్ సినిమాకి కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ ప్రాజెక్టు అనుకున్న సమయం కంటే ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్లింది.

ముందుగా పూజ హెగ్డే ఇచ్చిన డేట్స్ అయిపోయాయి..ఆ తరువాత ఆమె తన డేట్స్ ను సర్దుబాటు చేసే పరిస్థితి లేదు. అందువలన ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. కానీ ఇప్పుడు ఆమె మళ్లీ త్రివిక్రమ్ దర్శకత్వంలో .. బన్నీ కాంబినేషన్లో సినిమా చేయనున్నట్టుగా తెలుస్తోంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో’తో హ్యాట్రిక్ హిట్ కొట్టిన త్రివిక్రమ్ – బన్నీ మరో సినిమా రూపొందనుంది.  ప్రస్తుతం త్రివిక్రమ్ చేస్తున్న ‘గుంటూరు కారం’, బన్నీ చేస్తున్న ‘పుష్ప2’ పూర్తి కాగానే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు..!!

samantha rejected her best friend’s movie!

sreeleela makes a way for national crush rashmika?