in

Trisha as Jayalalithaa! Major Casting Talks for MGR Biopic

Trisha as Jayalalithaa! Major Casting Talks for MGR Biopic

తమిళనాడు రాజకీయాల్లో హీరోయిన్ త్రిష పేరు ఇటీవల కాలంలో తీవ్రంగా చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా నటుడు విజయ్ తమిళనాడు సీఎం అయిన తర్వాత ఆమె పేరు రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే కోలీవుడ్‌లో మరో ఆసక్తికర వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. తమిళనాడు మాజీ సీఎం, లెజెండరీ నటి జయలలిత పాత్రలో త్రిష నటించనుందనేది వార్తలు కోలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి.

లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘పురచ్చి తలైవర్ ఎంజీఆర్’ అనే బయోపిక్‌లో జయలలిత పాత్ర అత్యంత కీలకం కానుంది. వెండితెరపై నటిగా ఏలి, ఆ తర్వాత రాజకీయాల్లో పవర్‌ఫుల్ నాయకురాలిగా తనదైన ముద్ర వేసిన జయలలిత పాత్ర కోసం త్రిషను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంజీఆర్ సినీ ప్రస్థానం నుంచి రాజకీయ జీవితం వరకు ఉన్న కీలక ఘట్టాలతో రూపొందుతున్న ఈ సినిమాలో జయలలితగా త్రిష కనిపిస్తే ఈ ప్రాజెక్ట్‌పై క్రేజ్ రెట్టింపు కావడం ఖాయం..!!

Janhvi Kapoor’s Gold Dress Is Costlier Than Actual Gold!

Katrina Kaif finally Slams Postpartum Bodyshaming Trolls!