ఒక్క పాట హిట్‌తో ప్రేక్షకుల గుండెల్లో బుట్టబొమ్మగా సెటిల్ అయిపోయింది పూజా హెగ్డే. కానీ, ప్రస్తుతం బుట్టబొమ్మ అనడం కంటే..ఐరెన్ లెగ్ అనే ఎక్కువగా అంటున్నారు. దీని వల్లే తెలుగులో దాదాపు రెండు మూడు సినిమాలక సైన్ చేసిన తర్వాత కూడా బయటికి పంపించేశారు. దీని తర్వాత ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ దాదాపు అన్ని ఇండస్ట్రీల్లో తిరిగింది. ఫైనల్ గా బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో దేవా అనే సినిమాలో ఛాన్స్ పట్టుకుంది.
అంటే ఈ బుట్టబొమ్మ చేతిలో ప్రస్తుతం ఆ ఒక్క సినిమానే ఉంది. ఇక ఎంత ప్రయత్నించిన మరో సినిమా ఛాన్స్ రావడం లేదట. దీంతో పూజా పాప ఒక సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. సిల్వర్ స్క్రీన్ తో పని అయ్యేలా లేదని..ఓటీటీ బాట పట్టాలని ఫిక్స్ అయిందట..హర్రర్ – థ్రిల్లర్ జానర్ అంటే.. యాక్టింగ్‌కు ఎక్కువగా స్కోప్ ఉంటుంది. అందాల ఆరబోతలో ఈ బ్యూటీ ఎప్పుడూ వెనకడుగు వేయదు. నెట్ ఫ్లిక్స్ నిర్మించబోయే ఈ భారీ ప్రాజెక్ట్ పై పూజా పాప ఆశలు పెట్టుకోవచ్చు..!!