in

Pooja Hegde shares her bad experience with Indigo official!

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. తెలుగు, తమిళం, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా వరుస పెట్టి ఆఫర్లు చేజిక్కించుకుంటోంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ హోదాను ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మకు ముంబయి విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. తన పట్ల ఓ ప్రముక విమానయాన సంస్థకు చెందిన సిబ్బంది ఒకరు అవమానకరంగా ప్రవర్తించారని ట్విటర్ వేదికగా తెలియజేసింది. “ఇండిగో6ఈ సిబ్బంది ఈ రోజు మా పట్ల ఎంతో అవమానకరంగా ప్రవర్తించారు. మా విమానంలో విపుల్ నకాషే అనే సిబ్బంది ఈ రోజు మాతో అనుచితంగా వ్యవహరించారు. అహంకారంగా మాట్లాడటమే కాకుండా తిర్సకరణ తీరుతో బెదిరింపు ధోరణిలో వ్యవహరించారు. .

సాధారణంగా నేను ఇలాంటి విషయాల గురించి పట్టించుకోను. ట్వీట్ చేయను. కానీ ఇది నిజంగా భయంకరంగా ఉంది.” అని పూజా హెగ్డే ట్విటర్‌లో పేర్కొంది..ప్రస్తుతం పూజ చేసిన ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు, అభిమానులు కూడా ఆమెకు అనుకూలంగా పోస్టు పెడుతున్నారు. ఓ సెలబ్రెటీ పట్ల ఇలా ప్రవర్తించడం దారుణమని ట్వీట్ చేస్తున్నారు. పూజాకు జరిగిన ఈ అనుభవం పట్ల సదరు విమాన సంస్థ స్పందించింది. ఆమెకు జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. “మిసెస్ పూజా మీకు జరిగిన అవమానానికి క్షమించమని అడుగుతున్నాయి. మేము వెంటనే ఈ విషయంపై మీతో మాట్లాడాలనుకుంటున్నాం. మీ మొబైల్ నెంబర్‌తో కూడిన పీఎన్ఆర్ నెంబర్‌ను మాకు షేర్ చేయండి” అని ఇండిగో సంస్థ ప్రతిస్పందించింది.

RAMOJI RAO BLANK CHEQUE NU REJECT CHESINA ARUDRA!

nidhi agarwal opens up on telugu movies and ott offers!