in

Pooja Hegde, Kriti Shetty in race for ‘Icon’?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ పార్ట్ ను ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నారు. సెకండ్ పార్ట్ వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు బన్నీ. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమవుతుంది. ఇప్పుడు ‘ఐకాన్’ను పూర్తి చేయాలని బన్నీ ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా పూజాహెగ్డేను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

బన్నీతో రెండు సినిమాల్లో కలిసి పని చేసిన పూజాహెగ్డే ఇప్పుడు మూడోసారి అతడితో జతకట్టబోతుంది. ఇదిలా ఉండగా.. కథ ప్రకారం సినిమాలో మరో హీరోయిన్ కి కూడా ప్రాధాన్యత ఉంది. ఆ పాత్ర కోసం యంగ్ బ్యూటీ కృతిశెట్టిని తీసుకోవాలనుకుంటున్నారు. ‘ఉప్పెన’ సినిమాతో కుర్రకారుని ఆకట్టుకున్న కృతికి టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి. నాని, రామ్ లాంటి పేరున్న హీరోలతో కలిసి నటిస్తోంది. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ వస్తే ఇక టాప్ లీగ్ లోకి చేరిపోతుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు.

sangeeta darsakudu satyam gari chempa chellu manipinchina m.s.reddy!

Pawan Kalyan’s Next Title ‘Bhavadeeyudu Bhagat Singh’?