in

Pawan Kalyan’s Next Title ‘Bhavadeeyudu Bhagat Singh’?

ప‌వ‌న్ క‌ల్యాణ్ – హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. ఈ సినిమాకి టైటిల్ ఏంటా? అని అభిమానులంతా ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ప‌వ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా టైటిల్ ని అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని అనుకున్నారంతా. కానీ… జ‌స్ట్ ఓ చిన్న పోస్ట‌ర్ వ‌దిలారు. టైటిల్ మాత్రం అలానే ఉంచారు. ఇప్పుడు ఆ టైటిల్ ఫిక్స‌యిపోయింద‌ని టాక్‌. ఈ చిత్రానికి `భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్` అనే టైటిల్ ఖ‌రారు చేశార‌ని స‌మాచారం.

త్వ‌ర‌లోనే ఈ టైటిల్ ని అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. భ‌గ‌త్ సింగ్ అనే పేరు ఉన్నంత మాత్రాన‌… ఇదేం దేశ భ‌క్తి సినిమానో, బ‌యోపిక్ నోకాదు. పిరియాడిక్ డ్రామా కూడా కాదు. ఈ సినిమాలో హీరో భ‌గ‌త్ సింగ్ కి భ‌క్తుడు. భ‌గ‌త్ సింగ్ భావ‌జాలం హీరోలో న‌ర‌న‌రాన ఉంటుంద‌ట‌. అందుకే ఈ టైటిల్ అనుకుంటున్నారు. అయితే ప్ర‌స్తుతానికి ఇది వ‌ర్కింగ్ టైటిల్ మాత్ర‌మే అని స‌మాచారం. ఇదే టైటిల్ బాగుంద‌నుకుంటే దీన్ని ఫిక్స్ చేస్తారు. దీనికంటే బెట‌ర్ టైటిల్ వ‌స్తే.. అప్పుడు దాన్ని వ‌దులుతారు. ఇప్ప‌టికైతే ఈ సినిమా టైటిల్ ఇదే.

Pooja Hegde, Kriti Shetty in race for ‘Icon’?

ashima narwal hip navel show!