in

payal rajput to introduce her boyfriend into tollywood!

డిఫరెంట్ గా పాయల్ రాజ్ పుత్ తన బోయ్ ఫ్రెండ్ ని సినీపరిశ్రమకు పరిచయం చేస్తోంది. అది కూడా టాలీవుడ్ లో అతడు ఎంట్రీ ఇవ్వనుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. పాయల్ ఇటీవలే తన బోయ్ ఫ్రెండ్ సౌరబ్ దింగ్రాని అధికారికంగా సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది. సౌరబ్ పంజాబీ నటుడు కం గాయకుడు. పాయల్ కి కంపానియన్. పాయల్ రాజ్ పుత్ ఏ భాషలో షూటింగ్ చేసినా తనకు తోడు నీడగా ఉంటున్నాడు.

అయితే అందుకు గిఫ్ట్ గా అతడికి పాయల్ ఏం ఇస్తోందో తెలుసా?  సౌరబ్ ని ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ లో హీరోగా పరిచయం చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే దర్శకనిర్మాతలను లాక్ చేసేసిందిట. అందుకోసం పాయల్ టాలీవుడ్ లో తన పరిచయాల్ని వినియోగించుకుంటోంది. మొత్తానికి చెల్లినో అక్కనో తమ్ముడినో అన్ననో సినీపరిశ్రమకు పరిచయం చేయడం వేరు.. కానీ వీటన్నిటికీ భిన్నంగా పాయల్ ఏకంగా తన ప్రియుడినే సినీపరిశ్రమలో హీరోని చేస్తోంది! అంటూ గుసగుసలు వేడెక్కిస్తున్నాయి.

Stand Up Rahul Teaser, Raj Tarun, Varsha Bollamma!

Shraddha Das Is A Pretty Doll In these Saree Pics!