in

Pawan Kalyan buys a costly SUV worth rs 4 cr?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. సింప్లిసిటీకి కేరాఫ్ అడ్ర‌స్‌. తాను సెల‌బ్రెటీ అన్న విష‌యాన్ని కూడా మ‌రిచి నిరాడంబ‌ర‌మైన జీవితం గ‌డుపుతుంటారు. ఇక ప‌వ‌న్‌కు హంగులు, ఆర్భాటాలు ఏ మాత్రం న‌చ్చ‌వు. పెద్ద పెద్ద బంగ్లాల‌లో క‌న్నా.. ప‌చ్చ‌ని ప్ర‌కృతి మ‌ధ్య ఉండ‌డానిక‌కే ప‌వ‌న్ ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంటారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రజల సమస్యలపై స్పందించే విదంగా అడుగులు వేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా సినిమాలతో కూడా బిజీబిజీగా గడుపుతున్నారు.

ఇదిలా ఉంటే..ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో ప‌వ‌న్‌కు సంబంధించిన ఓవార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. పవర్ స్టార్ ఒక ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఎస్‌యూవీ రేంజ్ రోవర్ 3.0 మోడల్ కారుని బుక్ చేశార‌ట‌.దీని ఖ‌రీదు 4 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఉంటుందని టాక్. టాలీవుడ్ సెల‌బ్రిటీల‌లో కొంద‌రికి మాత్ర‌మే ఇలాంటి ల‌గ్జ‌రీ కారు ఉండ‌గా.. ఇప్పుడు ప‌వ‌న్ కూడా వారి జాబితాలో చేరాడు. అద్భుతమైన ఫీచర్స్‌తో, స్టైలిష్ అండ్ రాయల్‌గా ఉండే ఈ కార్‌లో పీకే ఎప్పుడు కనిపిస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.

balayya, nag multi starrer cinema nu pakkaku pettesina bellamkonda!

Priyanka Mohan Gorgeous Stills in Black Saree!