సినిమా ఇండస్ట్రీ లో ఒక సారి షూటింగ్ ప్యాక్ అప్ చెప్పిన తరువాత రీ అసెంబుల్ అవటం చాల అరుదుగా జరిగే సంఘటన చాల అరుదు, అటువంటి అరుదయిన సంఘటన చిరంజీవి గారు నటించిన టాగోర్ సినిమా షూటింగ్ లో జరిగింది. ఆ రోజు చిరంజీవి గారితో కలసి రాజారవీంద్ర నటించవలసిన హాస్పిటల్ సీన్ షూట్ చేయవలసి ఉంది, కానీ చిరంజీవి గారు ఏదో సినిమా ప్రివ్యూ చూడటం కోసం షూటింగ్ ముందుగానే ప్యాక్ అప్ చెప్పేసారు, ఈ షూట్ పూర్తి చేసుకొని ఇంకొక సీరియల్ షూట్ కి వెళ్ళాలి రాజారవీంద్ర. ఇప్పుడు వెళ్ళిపోతే ఇక ఆ సినిమా లో నటించే అవకాశం పోయినట్లే, చిరంజీవి గారు వెళ్ళిపోతూ దిగులుగా కూర్చున్న రాజా రవీంద్రను చూసి, ఏంటి డల్ గ ఉన్నావు అని అడిగారట,
రాజా రవీంద్ర విషయం చెప్పారు, వెంటనే చిరంజీవి గారు డైరెక్టర్ ను పిలిచి అందరు రీ అసెంబుల్ అవటానికి ఎంతసేపు అవుతుంది అని అడిగారట 2 లేదా 3 గంటలు పడుతుంది అనగానే అందరిని రీ అసెంబుల్ చేయమన్నారట, మళ్ళీ అందరు వచ్చి షూటింగ్ పూర్తి చేసుకొని వెళ్ళడానికి రాత్రి 2 గంటలు అయిందట. తాను చూడవలసిన సినిమా రేపు అయినా చూడవచ్చు తన వలన ఒక నటుడికి అవకాశం పోకూడదు అన్న చిరంజీవి గారి ఆలోచన ఎంత అద్భుతమో చూడండి. అందుకే ఆయన అందరివాడు, మెగాస్టార్.