in

mahanati confirmed for mahesh babu!

ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో భారీ హిట్ కొట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం మహేష్ గీతా గోవిందం ఫేం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారీ వారి పాట’ అనే సినిమాలలో నటిస్తున్నాడు. ఇది మహేష్ బాబుకి 27వ చిత్రం కావడం విశేషం.. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ మూవీ టైటిల్ లుక్, మోషన్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో ముందుగా మహేష్ సరసన కీర్తి సురేష్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు మేకర్స్.. ఆ తర్వాత కీర్తి ప్లేస్ లో బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి.. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తుంది. సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నట్టుగా నిర్మాతలు కన్ఫామ్ చేసారు. సినిమాకు సంబంధించి యూఎస్ లో కొంతమేర చిత్రీకరణ జరపాల్సి ఉంది. దీనితో కీర్తి సురేష్ యూఎస్ వర్క్ పర్మిట్ కోసం చిత్ర యూనిట్ వీసా కోసం కూడా అప్లై చేశారు. దీంతో కీర్తి సురేష్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయిపొయింది.

pack up cheppesina malli andharini reassemble cheinchina chiru!

adah sharma about her love failure!