in

ONCE “UGLY FACE” TODAY’S “SEXY TAMIL FRIEND”!

సినీ పరిశ్రమలో ఈ రోజు నీరాజనాలు అందుకుంటున్న ఎందరో సెలబ్రిటీలు మొదట్లో ఛీత్కారాలు, అవమానాలు ఎదుర్కున్న వారే. ఆ కోవకు చెందిన వాడే ధనుష్, ఎవరేమన్నా పట్టించుకోకుండా వరుస సినిమాలు చేసి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన నటుడు ధనుష్. ధనుష్ నటించిన మొదటి చిత్రం హిట్ అయింది కానీ ధనుష్ హీరో మెటీరియల్ కాదు అన్నారు అందరు, ఆ తరువాత ఆయన సోదరుడు సెల్వ రాఘవన్ నిర్మించిన ” కాదల్ కొండెయిన్” లో నటించాడు ధనుష్. ఈ సినిమా షూటింగులో ఘోరమయిన అవమానం చవి చూసాడు ధనుష్. సినిమా షూటింగ్ స్పాట్ కి వచ్చిన కొందరు హీరో ఎవరు అని అడిగితే వేరే ఎంకెవరినో చూపించాడట ధనుష్, చివరకు విషయం తెలుసుకున్న వారు..

హేయ్ చూడండిరా, ఇదిగో ఆటో డ్రైవర్, ఇతనే హీరో అంటూ అవహేళన చేశారట, వారిని ఏమి అనలేక, ఒంటరిగా కారులో కూర్చొని ఏడ్చాడట ధనుష్. తొలి రోజుల్లో “అగ్లీ పేస్” అంటూ అవహేళన చేసిన వారే ఇప్పుడు ధనుష్ ప్రతిభను చూసి నీరాజనాలు పలుకుతున్నారు. తన ప్రతిభ తో టాలీవుడ్, బాలీవుడ్, దాటి హాలీవుడ్ కి ఎదిగిన ధనుష్ ” ది గ్రే మాన్” అనే హాలీవుడ్ చిత్రంలో నటించాడు, అందులో నటించిన మరో హాలీవుడ్ నటుడు ” సెక్సీ తమిళ్ ఫ్రెండ్” అని పిలుస్తాడు ధనుష్ ని, ఇంతకంటే గొప్ప కితాబు ఏముంటుంది చెప్పండి.ఒకప్పటి అగ్లీ పేస్, ఇప్పటి సెక్సీ తమిళ్ ఫ్రెండ్ అవటం వెనుక ధనుష్ అనుభవించిన మనో వేదన, కఠోర శ్రమ ఎందరికి తెలుసు? ప్రతి విజయగాధ వెనుక ఒక కన్నీటి కధ తప్పకుండ ఉంటుంది..

can you guess the native places of these star comedians!

anasuya quits, manjusha Is The New Anchor Of Jabardasth!