in ,

A star is born after lot of struggle!

జీవితం ఎవరికి రెడ్ కార్పెట్ పరిచి వెల్కమ్ చెప్పదు, దానికి బెస్ట్ ఉదాహరణ అందాల నటుడు శోభన్ బాబు గారి జీవితం. అపార కుబేరుడు గా ఎదిగిన నటుడు తన సినిమా జీవితం ప్రారంభ దశలో చాల ఇబ్బందులు ఎదురుకున్నారు. చిన్న చిన్న రోల్స్, చాలి చాలని రెమ్యూనరేషన్స్, ఫ్యామిలీ పోషణ కి సరిపడక, ఇండస్ట్రీ వదిలి వెళ్లి పోదము అనుకున్న సమయంలో, మిడ్నైట్ అసిస్టెంట్ డైరెక్టర్ రూపం లో, నర్తనశాల మూవీ లో అభిమన్యు రోల్ ఆఫర్ తలుపు తట్టి పిలిచింది. మళ్ళి చిగురించిన ఆశ, కానీ మళ్ళి చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్, ఆ టైమ్ లో మిస్టర్ .పెర్ఫెక్షనిస్ట్, డైరెక్టర్ వి.మధుసూదన్ రావు డైరెక్షన్ లో వీర అభిమన్యు మూవీ లో అభిమన్యు గా ఫుల్ – లెంగ్త్ క్యారెక్టర్, తనని తాను ప్రూవ్ చేసుకొనే ఛాన్స్ వచ్చింది.

కానీ ఫస్ట్ టైమ్ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్, లెంతి డైలాగ్స్ శోభన్ బాబు గారు నెర్వస్ ఫీల్ అయ్యి టేక్ లు తీయడం, డైరెక్టర్ తో చివాట్లు తినడం. డైరెక్టర్ శోభన్ బాబు గారి ప్రాబ్లెమ్ అర్ధం చేసుకొని, యాక్షన్ సీన్ ప్లేస్ లో ఫైట్ సీన్ ప్లాన్ చేసారు, కన్ఫ్యూషన్ లో స్టార్ విలన్ రాజనాల గారిని గాయ పరిచారు శోభన్ బాబు, మళ్ళి చివాట్లు. ఇంటికి వెళ్లిన శోభన్ బాబు గారికి ఫీవర్ వచ్చింది, ఇక నేను ఇండస్ట్రీ కి పనికి రాను, మరుసటి రోజు డైరెక్టర్ గారితో చెప్పి ఊరికి వెళ్లి పోవాలని డిసైడ్ అయ్యారు. మరుసటి ఉదయం స్టూడియో కి వెళ్లి డైరెక్టర్ గారితో చెప్పే ఛాన్స్ లేక, మేకప్ వేసుకున్న శోభన్ బాబు గారు,’’డు ఓర్ డై’’ స్పిరిట్ తో పేజెస్ పేజెస్ ఉన్న డైలాగ్స్ సింగల్ టేక్ లో ఓకే చేసారు. డైరెక్టర్ హ్యాపీ, ఇన్ని రోజులు ఈ యాక్షన్ ఎక్కడ దాచి పెట్టావయ్యా అని పొగిడారు. శోభన్ బాబు గారు మళ్ళి వెనకకు తిరిగి చూడలేదు. ఆ విధంగా అభిమన్యు మన తెలుగు తెరకు ఒక అందాల నటుడిని ఇచ్చాడు.

Leave a Reply

Leave a Reply

F CUBE ‘GOVINDUDU ANDARIVADELE’

Types Of Tollywood Heroines!