in

official : Samantha enters hollywood with ‘Arrangements of Love’!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత అభిమానులకు గుడ్ న్యూస్. స‌మంత హాలీవుడ్ లో కి ఎంట్రీ ఇస్తుంది. తాజాగా త‌న ఇంటర్నేష‌నల్ ప్రాజెక్ట్ పై సామ్ సంత‌కం చేసింది. దీంతో సామ్ హాల్ వుడ్ ఎంట్రీ క‌న్ఫామ్ అయింది. కాగ ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ ల‌వ్’ అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. ప్ర‌ముఖ న‌వలిస్ట్ టైమెరి ఎన్‌. మురారి ర‌చించిన అరేంజ్‌మెంట్స్ ఆఫ్ ల‌వ్ అనే న‌వ‌ల ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్క‌బోతుంది.

ఈ న‌వ‌ల బెస్ట్ సెల్లింగ్ న‌వ‌ల గా ఉంది. అలాగే ఈ సినిమా కు డైరెక్ట‌ర్ గా ఫిలిప్ జాన్ వ‌హించ‌నున్నారు. అలాగే క‌థ ను కూడా ఫిలిప్ జాన్ సిద్ధం చేయ‌నున్నాడు. స‌హ రచ‌యిత గా నిమ్మి హ‌ర‌స్గామ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. అలాగే ఈ అరేంజ్‌మెంట్ ఆఫ్ ల‌వ్ అనే సినిమా సునీత తాటి నిర్మించ నున్నారు. కాగ సమంత హాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తుంద‌ని.. ఒక అంత‌ర్జాతీయ డైరెక్ట‌ర్ ను కూడా క‌లిసింద‌ని వార్తలు వ‌చ్చాయి.

ఇప్ప‌డు ఆ వార్తలు నిజం చేస్తు ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఫిలిప్ జాన్, సునీతతో కలిసి పని చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సమంత “నా పాత్ర సంక్లిష్టమైన పాత్ర… దానిని పోషించడం నాకు ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ గురించి చాలా ఆతృతగా వేచి చూస్తున్నాను” అంటూ ట్వీట్ చేసింది..ఆసక్తికరంగా ఈ చిత్రంలో సామ్ 27 ఏళ్ల ద్విలింగ మహిళగా బోల్డ్ పాత్రలో కనిపించనుంది.

Anubhavinchu Raja!

madhurima latest photoshoot in black dress!