in

NURSING YADAV IN COMA!

మెడియన్, విలన్, నర్సింగ్‌యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఆకస్మాత్తుగా ఆయన కోమాలోకి వెళ్లడంతో కుటుంబం సభ్యులు వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే నర్సింగ్ యాదవ్ పరిస్థితి విషమంగా ఉందనే విషయం వైద్యులు వెల్లడిస్తున్నట్టు సమాచారం. పలు చిత్రాల్లో తనదైన డైలాగ్ డెలివరీతో, కామెడీ విలనిజంతో ఆకట్టుకొన్న నర్సింగ్ యాదవ్‌పై అనారోగ్యం వెనుక వస్తున్న రూమర్లను ఖండిస్తూ ఆయన భార్య చిత్ర యాదవ్ మీడియాలో ఓ ప్రకటన చేశారు. అదేమిటంటే..

నా భర్త నర్సింగ్ యాదవ్ కొంతకాలంగా మూత్ర పిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్సలో భాగంగా గురువారం డయాలిసిస్ చేయించాం. అనుకోకుండా సాయంత్రం 4 గంటలకు కోమాలోకి వెళ్లాడు. దాంతో వెంటనే హైదరాబాద్‌లోని ఓ కార్పోరేట్ ఆస్పత్రికి తరలించాం. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స జరుగుతున్నది అని చిత్ర యాదవ్ మీడియాకు వెల్లడించారు.

నర్సింగ్ యాదవ్ అనారోగ్యం వెనుక అనేక అవాస్తవాలు మీడియాలో కనిపిస్తున్నాయి. ఆయన పరిస్థితి విషమించడానకి వెనుక కారణం అనారోగ్యమే. దీర్ఘకాలంగా బాధపడుతున్న వ్యాధులే కారణం. అంతకుమించి ఎలాంటి సంఘటనలు జరుగలేదు. వాస్తవాలు తెలుసుకొని ఆయన గురించి రాయండి. నర్సింగ్ యాదవ్ ఆరోగ్యం గురించి ఏదైనా కావాలంటే మమల్ని సంప్రదించండి. లేదా ఆయన తోటి నటీనటులు అడిగి రాయండి అని చిత్ర యాదవ్ కోరారు.

TOLLYWOOD ACTRESS GLAMOROUS SHOW!

ANDHARU BAGUNDALANI KORUKUNNA DASARI!