
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]ఉ[/qodef_dropcaps] స్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘జార్జ్ రెడ్డి’ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమాకి ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని భావించింది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ కి జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధి రావడానికి అంగీకరించారు. అయితే చివరి నిమిషంలో ఈ ఈవెంట్ కి హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు. పవన్ ముఖ్య అతిథిగా హాజరయితే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్న కారణంతో అనుమతి నిరాకరించారు. పవన్ కళ్యాణ్ అభిమానులు, విద్యార్థి సంఘాలు భారీగా హాజరయితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న కారణంగా ఈ వేడుకకు అనుమతి ఇచ్చేందుకు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి చిత్ర యూనిట్ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడ జరుపుకుంటారో వేచి చూడాలి.