in

Nivetha Pethuraj becomes a certified Formula one car racer!

చిత్రలహరి సినిమాలో నటించి నటిగా మంచి గుర్తింపు దక్కించుకున్న ఈమె కు అల వైకుంఠపురంలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. రామ్ కు జోడీగా ఈమె నటించిన రెడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పర్చినా కూడా ఈమెకు మాత్రం ఆఫర్లు వరుసగా వస్తున్నాయి. అందంతో పాటు అభినయం కూడా ఈ అమ్మడు అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకంతో వరుసగా ఆఫర్లు ఈమెకు దక్కుతున్నాయి. ప్రస్తుతం తెలుగు మరియు తమిళంలో పలు సినిమాలు చేస్తున్న ఈమె..

ముందు ముందు టాప్ హీరోయిన్ గా నిలుస్తుందనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ గా ఇంత బిజీగా ఉన్నా కూడా నివేథ పేతురాజ్ ఫార్ములా వన్ రేస్ మొదటి లెవల్ ను కంప్లీట్ చేసింది. త్వరలోనే రెండవ లెవల్ ను కూడా ఈమె నేర్చుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా చెబుతోంది. హీరోయిన్స్ చాలా సున్నితంగా సుకుమారంగా ఉంటారు. కాని ఈమె విషయంలో మాత్రం కాస్త విభిన్నంగా ఉంది అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. ఎంతో మందికి ఈమె ఆదర్శంగా నిలుస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

MANI RATNAM BREAKS SILENCE ON FILM WITH MAHESH BABU!

ANTHAHPURAM UNIT SABHYULANU NILUVU DOPIDI CHESINA MARISHUS DONGALU!