ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నాడు. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది..ఈ సినిమాకి ఇంకా చాలా సమయమే ఉంది. కానీ నటీనటులు, సాంకేతిన నిపుణుల విషయంలో ప్రశాంత్ నీల్ తొందరపడుతున్నాడు. ఎన్టీఆర్ కోసం నిధి అగర్వాల్ ని ఎంచుకున్నట్టు టాలీవుడ్ లో ఓ టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీస్ ఇప్పటికే నిధిని సంప్రదించి, డేట్లు లాక్ చేసేసిందని సమాచారం అందుతోంది.
ఎన్టీఆర్ పక్కన సినిమా అంటే నిధి బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే.అయితే ఇందులో నిధి మాత్రమే హీరోయిన్ కాదు. మరో కథానాయికకీ ఛాన్సుంది. ఆమెని బాలీవుడ్ నుంచి దిగుమతి చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మొత్తానికి ప్రశాంత్ నీల్.. కాస్త స్పీడుమీదే ఉన్నాడు. చేతిలో సలార్ ఉన్నప్పటికీ, కేజీఎఫ్ 2 చాప్టర్ మిగిలే ఉన్నప్పటికీ.. ఎన్టీఆర్ సినిమాపై ఫోకస్ పెడుతున్నాడు. అతి త్వరలోనే ఈ సినిమాలోని నటీనటుల్ని ఫిక్స్ చేసి, ఓ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.