సుశాంత్ రాజ్‌పుత్ సింగ్ మరణం తర్వాత డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. నార్కోటిక్ విభాగానికి చెందిన అధికారులు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు సహా మరికొంత మందిని అరెస్ట్ చేసింది. ఆ సమయంలో నటి రకుల్ ప్రీత్ సింగ్‌కు నార్కోటిక్ విభాగం నోటీసులు జారీ చేసిందంటూ పలు టీవీ ఛానెల్స్‌లో వార్తలు ప్రసారమయ్యాయి. ఈ వార్తలపై రకుల్ చాలా సీరియస్ అయ్యింది. తనకు నార్కోటిక్ విభాగం నుండి నోటీసులు రాకపోయినా..
మీడియాలో ఓ విభాగంవారు తనను టార్గెట్ చేశారంటూ ఢిల్లీ హైకోర్టులో రకుల్ ప్రీత్ సింగ్ కేసు వేసింది. ఈ కేసులో రకుల్ ప్రీత్‌సింగ్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్డు ఆదేశాలను అనుసరించిన న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ ఆధారిటీ రకుల్‌పై నిరాధారమైన వార్తలను ప్రసారం చేసిన ఛానెల్స్‌ను నిర్దారించింది. సదరు ఛానెల్స్ రకుల్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది.