in

Samantha Confirms Pregnancy, Shares Maternity Leave Plans!

స్టార్ హీరోయిన్ సమంత తాను తల్లి కాబోతున్నట్లు స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో సినిమాలకు తాత్కాలికంగా విరామం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. తన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్‌లో బుధవారం ఆమె ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. కొద్ది వారాలుగా ఆమె గర్భవతి అంటూ వస్తున్న ఊహాగానాలకు ఈ ప్రకటనతో తెరపడింది. ‘మా ఇంటి బంగారం’ చిత్ర విజయోత్సవ వేడుకలో సమంత మాట్లాడుతూ..

ఈ పరిణామం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండనున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన బి.వి. నందినీ రెడ్డి కూడా ఈ వార్తను ధృవీకరించారు. సినిమా ఘన విజయం సాధించిన తరుణంలో ఈ శుభవార్త రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. సమంత నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం, విడుదలైన 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా RS 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం..!!

Nayanthara in an action-packed mode for salman khan’s film!

telugu actors who did dual roles!