జాతిరత్నాలు’ ఫేమ్ నవీన్ పోలిశెట్టికి అమెరికాలో యాక్సిడెంట్ అయినట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నవీన్ అమెరికాలో ఉన్నారు. అమెరికా వీధుల్లో బైక్ పై వెళ్తున్న సమయంలో స్కిడ్ అయి ఆయన కింద పడిపోయినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో నవీన్ చేతికి ఫ్రాక్చర్ అయిందని చెపుతున్నారు.
గాయం తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండటంలో రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొంత కాలం పాటు షూటింగులకు నవీన్ దూరంగా ఉండబోతున్నారు. మరోవైపు ఈ వార్తపై నవీన్ లేదా ఆయన టీమ్ అధికారికంగా స్పందించాల్సి ఉంది..!!