in

NAVDEEP TURNS INTO A POET FOR SUNNY LEONE!

హాట్ బాంబు సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, తను సినిమాలో ఉందంటే కేవలం తనని చూడడానికి మాత్రమే థియేటర్ కు వచ్చే సంఖ్య చాలా పెద్దదంటే..ఈ సెక్సీ భామకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ ఎటువంటిదో అర్ధం చేసుకోవచ్చు. తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసిన సన్నీ కు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం సన్ని తెలుగు యువ హీరో నవదీప్‌తో రొమాన్స్ చేస్తోంది. హిందీ నిర్మాణ సంస్థ ఆల్ట్ బాలాజీ హిందీలో “రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్” అనే వెబ్ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో తెలుగు నటుడు నవదీప్ కూడా నటిస్తుండడం విశేషం..

ఇదే క్రమంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.. తమ స్నేహం గురించి అందరికి తెలిసేలా ప్రేమను పంచుతూ నవదీప్ సన్నీపై ఒక కవిత్వం రాసి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు.. “సన్నీ ఈజ్ ఫన్నీ… సన్నీ ఈజ్ స్మార్ట్… సన్నీ ఈజ్ హోమ్.. సన్నీ ఈజ్ సేఫ్.. బీ లైక్ సన్నీలియోన్.. ఐసోలేట్ యువర్సెల్ఫ్ అండ్ వాచ్.. రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్” అంటూ ఒకవైపు సెక్సీ సన్నీ ను పొగుడ్తూనే తమ వెబ్ సిరీస్ ను కూడా ప్రమోట్ చేసాడు నవదీప్.. ఇదిలా ఉండగా, ఈ పోస్ట్ చుసిన నెటిజన్లు ‘నవదీప్ ఈజ్ సో నాటీ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. కానీ సన్నీ భామ మాత్రం ఈ పోస్ట్ కు ఇంతవరకు లైక్ గాని దీని మీద కామెంట్ గాని చేయలేదు.. వేచి చూద్దాం మరి సన్నీ ఎలాంటి రిప్లై ఇస్తుందో..!!

HAPPY BIRTHDAY PRABHU DEVA!

RAKUL NOT HAPPY WITH HIS PRODUCER!