in

national crush rashmika not available till 2027!

చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఎంతలా అంటే దాదాపు 2027 వరకు అమ్మడి డైరీ ఖాళీ లేదని టాక్. ఈ ఏడాది శేఖర్ కమ్ముల డైరక్షన్ లో తెరకెక్కుతున్న ‘కుబేర’ సినిమాతో దీపావళి బరిలో దిగుతోంది. ఇందులో ధనుష్, నాగార్జున లాంటి స్టార్స్ ఉన్నారు. నెక్స్ట్ డిసెంబర్ లో ‘పుష్ప 2 ‘ తో బ్లాస్ట్ కి రెడీ గా ఉంది. ఈ రెండిటి తరవాత ‘రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం లో  ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే సినిమా చేస్తోంది. ఇది ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ.  ఇప్పటివరకు కమర్షియల్ సినిమాల్లో నటించిన రష్మిక మొదటిసారిగా ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా చేస్తుండటం విశేషం.

ఇది కూడా పానిండియా వైడ్ గా అన్ని భాషల్లో రిలీజ్ అవుతోంది…బాలీవుడ్ లో మురుగు దాస్, సల్మాన్ కాంబో మూవీ ‘సికిందర్’ లో రష్మిక నటిస్తోంది. ఈ మూవీ 2025 లో వచ్చే ఛాన్స్ ఉన్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసారు. సల్మాన్ లాంటి సూపర్ స్టార్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీ హిట్ అయితే బాలీవుడ్ లో శ్రీవల్లి  హావా మొదలైనట్టే. ఇది కాకుండా  విక్కీ కౌశల్ తో ‘చావా’ లో కూడా నటిస్తోంది. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ లో ఇప్పటికే రష్మికను ఫిక్స్ చేశారు..!!

young beauty Bhagyashri Borse To Romance Dulquer Salmaan!

Celebrities Who Have Won Political Elections 2024!