in

nani’s gang leader heroine roped in for surya’s next!

చాల రోజుల నుండి సరైన హిట్ లేక సూర్య సతమవుతున్నాడు…అదే సమయంలో విడుదలైన ఆకాశం నీ హద్దురా సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అది సూర్య కెరీర్‌లో 38వ సినిమా దాని తరువాత చేయాల్సిన 39వ సినిమా గురించి సరైన విషయం తేలలేదు కానీ అప్పుడే సూర్య తన 40వ సినిమా అప్‌డేట్‌ను ఇచ్చేశాడు. ఈ సినిమా కోలీవుడ్ స్టార్ దర్శకుడు పాండిరాజ్ డైరెక్ట్ చేయనున్నాడట.

ఈ చిత్రాన్ని కోలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్‌ వారు ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ సినిమా గురించి గత ఏడాది ప్రకటించిన సంస్థ హీరోయిన్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇటీవల ఈ సినిమాలో నానీ గ్యాంగ్‌లీడర్ ముద్దుగుమ్మ ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించనుందని తెలిపారు. అతి త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై డీ ఇమ్మాన్ నిర్మించనున్నారు.

disha patani receives death threatening calls from Pakistan!

super over!