in

nani comments about liplock scenes and mrunal thakur’s magic!

సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. తనకు ఇతర సినిమా అవకాశాలు వచ్చిన కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ నేపథ్యంలో ఫాద‌ర్ డాట‌ర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తరువాత నాని ఆమె నటన పట్ల చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

నాని మాట్లాడుతూ మృణాల్‌లో ఏదో తెలియని ఎక్సైటింగ్ పాయింట్ ఉంది..స్క్రీన్ మీద తన మ్యాజిక్ చేస్తుంది..కెమెరా వెనుక ఎలా ఉన్నా కెమెరా ముందు మాత్రం న‌ట‌న‌తో రెచ్చిపోతుంది అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక ఈ సినిమాలో లిప్ లాక్ సీన్స్ కూడా ఉన్నాయనే సంగతి తాజాగా రిలీజ్ అయిన టీజర్ చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ సీన్స్ పై నాని స్పందిస్తూ సినిమాకు అది అవసరం కాబట్టే పెట్టామని కామెంట్ చేశాడు. ఇక దసరా సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్న నాని ఈ మూవీతో ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి..!!

happy birthday nivetha Thomas!

gang leader girl Priyanka Mohan bags Ravi Teja’s next!