in

gang leader girl Priyanka Mohan bags Ravi Teja’s next!

ప్రియాంక మోహన్…గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి పాజిటివ్ ఇంపాక్ట్ చూపించింది. అయితే ఆ తర్వాత అడపాదడపా కొన్ని సినిమాలు చేసింది ఈ భామ. కానీ తెలుగులో అనుకున్నంతగా వర్కౌట్ అవ్వలేదు. మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. అయితే సడెన్ గా ఈ భామ కెరీర్ అద్భుతంగా టర్న్ అయింది. ఈమెకు వరసగా తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజి చిత్రంలో ప్రియాంక హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెల్సిందే.

రీసెంట్ గా నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అనౌన్స్ అయిన సరిపోదా శనివారం చిత్రంలో కూడా ప్రియాంక హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ ను ఈ భామ చేజిక్కించుకుందని తెలుస్తోంది. రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా రీసెంట్ గా లాంచ్ అయింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక దాదాపు కన్ఫర్మ్ అయినట్లే..!!

nani comments about liplock scenes and mrunal thakur’s magic!

shocking: Premam director quits doing movies