in

anushka shetty not interested in Doing Pan India Films?

మొన్నీమధ్యనే అనుష్క శెట్టి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలో కనిపించిన సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత అనుష్క చేసిన సినిమా అది. ఆ సినిమాని ఒప్పుకోవడానికే అనుష్క మీనమేషాల్లెక్కెట్టింది. ఎలాగోలా దర్శకుడు, చిత్ర నిర్మాణ సంస్థ..నానా తంటాలూ పడి అనుష్కని ఒప్పించాల్సి వచ్చింది. మరీ తీసికట్టు సినిమా ఏమీ కాదు..అలాగని, హిట్టు సినిమా కూడా కాదు.! ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మమ అనిపించేసిందంతే. అది కూడా, అనుష్క మ్యాజిక్..దాంతోపాటుగా నవీన్ పోలిశెట్టి మ్యాజిక్ కూడా ఆ సినిమా అలా ఆడటంలో కీలక పాత్ర పోషించాయి.

ఇక, అసలు విషయానికొస్తే, అనుష్కతో సినిమా కోసం ముగ్గురు దర్శకులు సిద్ధంగా వున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలే, అనుష్క వెంట పడుతున్నాయి..ఆ మూడు ప్రాజెక్టుల కోసం. అనుష్క మాత్రం, ఇంతవరకు ఏ ప్రాజెక్టుకీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. కారణమేంటన్నది తెలియరావడంలేదుగానీ, అనుష్కతో సినిమాలు చేయాలని దర్శక నిర్మాతలకు వున్నా, ఆమె మాత్రం సినిమాలు చేయడానికి అంత సుముఖంగా కనిపించడంలేదు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ప్రమోషన్లలోనూ అనుష్క ప్రత్యక్షంగా కనిపించని సంగతి తెలిసిందే..!!

Dhanush to play Ilayaraja in Biopic?

happy birthday nivetha Thomas!