in

nani and sharwanand in bapu ramana biopic?

బ‌యోపిక్ లు ఎక్కువగా బాలీవుడ్ లోనే తెరక్కెక్కాయి. సౌత్ లో బయోపిక్ ల జోలికి వెళ్లాలంటే కొంచెం ఆలోచిస్తారు. ఎందుకు రిస్క్ అని వెనక్కి తగ్గుతారు. బయోపిక్ తీసి టెన్షన్ పడే కంటే కమర్షియల్ సినిమా అయితే బెటర్ అనుకుంటారు. కానీ ఈ లెక్కలన్నీ మహానటి మూవీకి ముందు. నాగ అశ్విన్ తెరకెక్కించిన మహానటి మూవీ నేషనల్ అవార్డు గెలుచుకుంది. అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీనితో బయోపిక్ ల పై కొందరి ద్రుష్టి మరలింది.

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్ తెరెక్కుతోంది. ఇందులో ధనుష్ ఇళయరాజా పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పడు టాలీవుడ్ ప్రముఖులు, దోస్తులు అయిన బాపు, రమణల బయోపిక్ తెరకెక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది. సాయి మాధ‌వ్ బుర్రా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విషయాన్ని చెప్తూ ఆ పాత్రల్లో నేచుర‌ల్ స్టార్ నాని – శ‌ర్వానంద్ లు నటిస్తే బాగుంటుందని కూడా అభిప్రాయ పడ్డారు. ఎవరైనా ముందుకు వస్తే బాపు-ర‌మ‌ణల క‌థ‌ను సాయి మాధ‌వ్ స్క్రిప్ట్ రూపంలో రాసి ఇస్తానని పేర్కొన్నారు..!!

rashmika mandanna admits she has had some skin issues!

Samantha’s Jaw-Dropping Photoshop Edit Leaves Internet in Awe