నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ది చాల డిఫ్రెంట్ స్టైల్, ఎక్కడ హంగామా హడావిడి ఉండదు, చాల లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తారు. తాత యెన్.టి.ఆర్. మీద ఉన్న గౌరవం తో యెన్.టి.ఆర్. ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి ప్రతిష్టాత్మకం అయిన సినిమాలు చేస్తూ ఉంటారు. కళ్యాణ్ రామ్ వైఫ్ స్వాతి, డాక్టర్ బై ప్రొఫెషన్, కానీ ఆమె హౌస్ మేకర్ గ ఉంటూ, తన ఇద్దరు బిడ్డలే లోకంగా గడిపేస్తుంటారు.కళ్యాణ్ రామ్ ఫామిలీ బయట ఫంక్షన్స్ లో కూడా పెద్దగా కనిపించరు, అటువంటి స్వాతి గారి ఫేవరేట్ నటుడు ఎవరో తెలుసా? ఆమె కాలేజీ డేస్ నుంచి ఆ హీరో సినిమా రిలీజ్ అయితే కాలేజీ కి బంక్ కొట్టి మరి ఆ సినిమా చూసేసే వారట. ఇంకెవరు కళ్యాణ్ రామ్ అయి ఉంటారు అందుకే ఆయన్ను వివాహం చేసుకున్నారు అనుకుంటున్నారా? స్వాతి గారికి సీనియర్ హీరో, టాలీవుడ్ మన్మధుడు నాగార్జున అంటే ఇష్టం అట, నాగ్ నటించిన “మన్మధుడు” సినిమా ఆమెకు ఎంతో ఇష్టం అయిన సినిమా, ఆమె ఆ సినిమా లెక్క లేనన్ని సార్లు చూశారట. ఈ విషయాన్నీ కళ్యాణ్ రామ్ గారే స్వయంగా చెప్పటం జరిగింది..