in

Aarthi Agarwal A COMMITED ARTIST!

దివంగత ఆర్తీ అగర్వాల్ చాల తక్కువ కాలం టాలీవుడ్ లో మెరుపులు మెరిపించి అంతర్ధానం అయిపోయిన ఒక మెరుపు లాంటి నటి. “నువ్వు నాకు నచ్చావ్” సినిమా తో ఎంట్రీ ఇచ్చిన ఆర్తీ అగర్వాల్ 2001 నుంచి 2004 మధ్య టాలీవుడ్ టాప్ హీరోస్ అందరి తో నటించింది. అందం, అభినయమే కాకుండా ఆమె చాల అంకిత భావం తో పని చేసే వారు, అందుకు నిదర్శనం గ ఒక సంఘటన ఇక్కడ ప్రస్తావించాలి. జూనియర్ యెన్.టి.ఆర్. హీరో గ వచ్చిన “అల్లరి రాముడు” షూటింగ్ తలకోన అడవుల్లో జరుగుతుంది, ఆమె వర్షం లో తడవటం తో 102 డిగ్రీల జ్వరం, వళ్ళు నొప్పులతో బాధ పడుతుందట. ఆ కండిషన్ లో షూటింగ్ చేయటం సాధ్యం కాదు.

ఆమె ఒక్క రోజు రెస్ట్ తీసుకుంటే యెన్.టి.ఆర్. డేట్స్ మళ్ళీ దొరకటం కష్టం, అదే సమయం లో డైరెక్టర్ బి.గోపాల్ ఇంద్ర సినిమా కూడా డైరెక్ట్ చేస్తున్నారు అయన కూడా బిజీ. ఆ విషయం గమనించిన ఆర్తీ అగర్వాల్ తన మూలంగా ఇంత మంది కి ఇబ్బంది కలగ కూడదు అని టాబ్లెట్స్ వేసుకొని, షూటింగ్ కి అటెండ్ అయింది. నాకెందుకులే అని ఆర్తీ అనుకోని ఉంటె నిర్మాతకు, చాల నష్టం జరిగి ఉండేది, హీరో, డైరెక్టర్ కి ఇబ్బంది కలిగి ఉండేది. వీరందరి ని దృష్టిలో ఉంచుకొని ఆమె జ్వరంలో కూడా నటించినందుకు నిర్మాత చంటి అడ్డాల హ్యాపీ గ ఫీల్ అయ్యారు, ఆమె కమిట్మెంట్ కు హాట్స్ ఆఫ్ చెప్పారు.అందుకే నటులకు నటనే కాదు, నడవడి కూడా చాల ముఖ్యం..

poorna turns the evil woman for nani’s ‘dasara’!

LIGER TRAILER, Vijay Deverakonda, Puri Jagannadh, Ananya Panday!