నిజంగా తాము చూస్తున్నది నమితనేనా.. కాదా? అని ఆశ్చర్యానికి గురయ్యారు. అంతలా మారిపోయింది నమిత. చాలా స్లిమ్‌గా అయిపోయి.. సినిమాల్లోకి వచ్చిన స్టార్టింగ్ డేస్‌ని నమిత గుర్తు చేసింది. అయితే నమితపై కోలీవుడ్‌లో ఆమె లావుపై ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమె లావెక్కడానికి కారణం అధికంగా మద్యం సేవిండంతో పాటు స్మోకింగ్ చేయడమేనంటూ కోలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. తనపై నడుస్తున్న ప్రచారంపై తాజాగా నమిత స్పందించారు.
కొన్నేళ్ళుగా తాను మానసిక సమస్యతో బాధపడుతూ వచ్చానని, ఇలాంటి సమస్య ఉందనే విషయం కూడా తనకే తెలియదని, అనేక నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పారు. నిద్రకోసం అతిగా భోజనం చేశానని, ముఖ్యంగా పిజ్జా, బర్గర్లు అధికంగా తిన్నానని చెప్పారు. ఈ కారణంగానే తన బరువు విపరీతంగా పెరిగింది తప్ప మద్యం, పొగతాగడం అనే రెండు వ్యసనాలకు తాను ఎప్పుడూ బానిసగా మారలేదన్నారు. అలాగే థైరాయిడ్ సమస్య కూడా తన బరువు పెరగడానికి ఒక కారణమని చెప్పారు.