in

Ram Charan speaks about Alluri Sitarama Raju getup in RRR!

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ ఆవరణలో జరుగుతున్న స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలకు మెగా పవర్ స్టార్ రాంచరణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారుల బహుమతుల పంపిణీ కార్యక్రమంలో చెర్రీ ఎంతో ఎమోషనల్ గా మాట్లాడారు. సీపీ సజ్జనార్ పిలుపు మేరకు పోలీసుల కార్యక్రమానికి విచ్చేశానని.. అయితే ఆ సమయంలో ఆర్.ఆర్.ఆర్ కోసం అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఉన్నానని తెలిపిన చరణ్ .. గెటప్ ని తొలగించేందుకు గంటన్నర శ్రమించాల్సి వచ్చిందని తెలిపారు.

ఆ వేషధారణ మేకప్ కోసమే మూడు గంటలు పడుతోందన్న టాప్ సీక్రెట్ ని రివీల్ చేశారు. గంటన్నర మేకప్ వేసేందుకు గంటన్నర తీసేందుకు పడుతోందని వెల్లడించారు. ఇంతకుముందు చరణ్ షీటీమ్స్ కార్యక్రమానికి ఎటెండయ్యానని తెలిపారు. పోలీసుల కార్యక్రమాలు అంటే తనకు ఆసక్తి అని ఎప్పుడు పిలిచినా వస్తానని అన్నారు. 500 పోలీసుల కుటుంబాలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించిన సైబరాబాద్ సీపీ సజ్జనార్ కి కృతజ్ఞతలు తెలిపారు.

namitha responds on smoking and alcohol consumption rumors!

jeevitha to direct her husband rajashekar once again?