తనలో ఫీలింగ్స్ అమ్మాయిగా ఉండి.. రూపం మాత్రం అబ్బాయిగా ఉండేది. దీంతో వెంటనే ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారిపోయారు. ఆ తర్వాత తప్పు చేశానా ? అంటూ డిప్రెషన్లోకి వెళ్లాడు. నేనే ధైర్యం చెప్పాను. ఇలా ఎంతోమంది తామేంటో ఈ ప్రపంచానికి తెలియనివ్వు.. సంఘర్షణను తమలోనే భరిస్తుంటారు. కానీ నువ్వు సాహసం చేశావు. ఈ ఇష్టానికి తగ్గట్టుగా బతుకుతున్నావ్ అంటూ సపోర్ట్ ఇచ్చాను. కానీ ఆ తర్వాత షోలో అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత నేను వేరే షోకు తీసుకున్నాను.
అలాగే సొంతంగా యూట్యూబ్ చానెల్ పెట్టుకుంది. నా ముందే ఎదిగింది.. ఎవ్వరిని నొప్పించని మనస్తత్వం. బిగ్ బాస్ లోకి వెళ్తుంది అని తెలియానే సర్ ప్రైజ్ అనిపించింది. అక్కడకు వెళ్లడమే పెద్ద అచీవ్ మెంట్ గా ఫీలవుతుంటారు. గెలిచినా.. ఓడినా.. గొప్పగా ఫీలవుతుంటారు. అలాంటి అతి పెద్ద షోలోకి ప్రియాంక వెళ్లడం ఆనందంగా ఉంది.. తనకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. తను కెమెరా ముందు ఎలా ఉందో.. బయట కూడా అలాగే ఉంటుంది. విన్నర్ కావడమా.. లేదా అన్నది తెలియదు.. కానీ నా మద్దతు మాత్రం తనకే అంటూ చెప్పుకొచ్చారు నాగబాబు.